ఢిల్లీ సీఎంకు క‌రోనా పాజిటివ్‌..!

N ANJANEYULU
ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు క‌రోనా పాజివిట్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో ఆయ‌న ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉన్నారు. తేలికపాటి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని కేజ్రీవాల్ ట్వీట్‌లో వెల్ల‌డించారు. అయితే తేలిక‌పాటి ల‌క్ష‌ణాలుండ‌డంతో  నేను కోవిడ్ ప‌రీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. ఇంట్లో న‌న్ను ఒంట‌రిగానే ఉంచుకున్నాను గ‌త కొద్ది రోజులుగా నాతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రూ మిమ్మ‌ల్ని మీరు ఒంట‌రిగా ఉంచుకోండి అని.. మీరు ప‌రీక్షీంచుకోవాల‌ని ట్వీట్‌లో సూచించారు.
 
ఉత్త‌ర‌ఖాండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌చారాన్ని ప్రారంభించ‌డానికి అర‌వింద్ కేజ్రీవాల్ సోమ‌వారం డెహ్రాడూన్‌లోనే ఉన్నారు. డెహ్రాడూన్ ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన ఉత్త‌ర‌ఖండ్ న‌వ నిర్మాణ్ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగం చేసారు. గ‌త ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్ భార్య సునిత కొవిడ్ 19 పాజిటివ్ వ‌చ్చింది. అయితే ఆమె ఇంట్లో ఒంట‌రిగానే ఉన్న‌ది. అయితే ముఖ్యమంత్రి కూడా ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా ఒంట‌రిగానే ఉన్నారు. ఢిల్లీలో కొవిడ్‌-19, ఒమిక్రాన్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 351 ఓమిక్రాన్‌ కేసులు న‌మోదు కాగా.. అందులో 57 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: