నిక్ : మై ఫర్ ఎవర్ న్యూ ఇయర్ కిస్


నూతన సంవత్సర వేడుకల్ని ఎవరు ఎలా జరుపుకున్నారనే విషయం పై సర్వత్రా ఆసక్తి ఉంటుంది.  మీడియా జనం కూడా ఆ వార్తలపై ఎక్కువ దృష్టి సారిస్తారు.  సినీ రంగం ప్రముఖులు న్యూ ఇయర్ ను ఎలా సెలిబ్రేట్ చేసుకున్నారు ? అన్న విషయం పై ఇక చెప్పనవసరం లేదు. సినీ రంగంలో సెలిబ్రటీ జంట గా పేరుగాంచిన ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ లు 2022 ను ఎలా స్వాగతించారో తెలుసా ?
ప్రియాంక చోప్రా గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె బాలీవుడ్ నటి మాత్రమే కాదు, 2000 వ సంవత్సరంలో  ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న భారత మహిళ. ఆమె భర్త నిక్ ఒక పాప్ సింగర్, పాటల రచయిత కూడా. వీరిద్దరూ  సెలిబ్రటీ జంట గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ జంట తాము నూతన సంవత్సరాన్ని ఎలా స్వాగతించారనే విషయాన్ని నిక్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన  సామాజికమాధ్యమంలో పోస్టు చేశారు. తెల్లని దుస్తుల్లో ఉన్న ప్రియాంక చోప్రా తన ప్రియమైన భర్త నిక్ చెంపపై  సున్నితంగా ముద్దాడటాన్ని మనం  ఈ  చిత్రంలో చూడవచ్చు. సామాజిక మాధ్యమాల్లో నిక్ చేసిన కామెంట్ ఏమిటో తెలుసా ?  మై ఫర్ ఎవర్ న్యూ ఇయర్ కిస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: