ఒమిక్రాన్ : తెలంగాణ‌లో కొత్త‌ కేసులు ఎన్నో తెలుసా..?

N ANJANEYULU
ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రినీ భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భార‌త్‌లో కూడా బెంబేలెత్తిస్తుంది. తాజాగా భార‌త్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి భార‌త్‌కు చేరుకునే వారి నుంచే ఎక్కువ‌గా కేసులు న‌మోదు అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో అయితే ఒమిక్రాన్ కేసులు చాప‌కింద నీరులా నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో మ‌రొక 12 నూత‌నంగా ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి.
ఈ కొత్త కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకున్న‌ది. ఒమిక్రాన్ బారిన ప‌డి 10 మంది బాధితులు ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్నారు. ఇవాళ వెలుగులోకి వ‌చ్చిన కేసుల‌లో 10మంది నాన్ రిస్క్ దేశాల నుండి వ‌చ్చిన వారికి సోకింద‌ని వైద్యారోఘ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. మ‌రొక ఇద్ద‌రు మాత్రం కాంటాక్ట్ ఒమిక్రాన్ బాధితులు అని పేర్కొన్నారు. మ‌రోవైపు రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 182 కొవిడ్ కేసులు, 1 మ‌ర‌ణం సంభ‌వించింది. 181 మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3417 క్రియాశీల కేసులు ఉండ‌గా.. రిక‌వ‌రీ రేటు 98.90 శాతం ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 0.59 శాతం ఉన్న‌ద‌ని ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బుటిటెన్‌లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: