క‌రోనా :19 మంది విద్యార్థులకు.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
క‌రోనా మ‌హమ్మారీ రోజు రోజుకు మ‌ళ్లీ విజృంభిస్తూనే ఉన్న‌ది. ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. నిత్యం నూత‌న కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. గ‌త‌వారం న‌వీ ముంబైలో న‌వోద‌య స్కూల్‌లో 18 మంది విద్యార్థుల‌కు క‌రోనా వ్యాపించ‌గా.. తాజాగా మ‌రొక పాఠ‌శాల‌లో చ‌దువుతున్న 19 మంది ఈ వైర‌స్ బారీన ప‌డ్డారు. త‌క్లిదోఖేశ్వ‌ర్ ప్రాంతంలో ఉన్న జ‌వ‌హ‌ర్ న‌వోద‌య రెసిడెన్షియ‌ల్ స్కూల్‌లో దాదాపు 450 మంది విద్యార్థులు ఆ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు.
క‌రోనా టెస్టులు చేయించ‌గా.. 19 మందికి పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ది. దీంతో అధికారులు బాధిత విద్యార్థులంద‌రినీ ప‌ర్నర్ రూర‌ల్ హాస్పిట‌ల్ ఐసోలేష‌న్‌లో ఉంచి మెరుగైన చికిత్స‌ అందిస్తున్నారు. వారి సాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు అధికారులు విద్యార్థుల‌తో కాంటాక్ట్ లో ఉన్న వారంద‌రినీ గుర్తించి టెస్ట్ లు చేస్తూ ఉన్నారు. డిసెంబ‌ర్ నెల‌లో ముంబైలోని ప‌లు పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. ముఖ్యంగా జ‌వ‌హర్ న‌వోద‌య రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో కేసులు ఎక్కువ‌గా  న‌మోదు కావ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: