బ్రేకింగ్: యాక్ష‌న్ కింగ్ అర్జున్‌కి క‌రోనా పాజిటివ్‌..!!

VUYYURU SUBHASH
మాయదారి కరోనా మళ్లీ మానవాళి పై పగబట్టింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ప్రపంచాని గడగడలాడిస్తూ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలే కాకుండా స్టార్ సెల‌బ్రిటీలు సైతం మళ్లీ క‌రోనా మహమ్మారి బారిన ప‌డుతుండడం అందరిని టెన్షన్ కు గురిచేస్తుంది.. రీసెంట్‌గా బాలీవుడ్‌ బ్యూటీ హీరోయిన్‌ కరీనా కపూర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యాక్షన్ కింగ్ అర్జున్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఆరోగ్యం బాగోలేక వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిన్నట్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆయనకు క‌రోనా పాజిటివ్‌గా వచ్చిందని... డాక్టర్స్ సూచ‌న‌లు పాటిస్తూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా అని. ఈ మ‌ధ్య తనని క‌లిసిన వారు కూడా ద‌య‌చేసి క‌రోనా టెస్ట్ చేయించుకోండి అని అర్జున్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: