రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

N ANJANEYULU
తెలంగాణ ఇంటర్ ప్ర‌థ‌మ‌ సంవత్సరం పరీక్ష ఫలితాలను బుధవారం ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత సంవ‌త్స‌రం ర‌ద్దు అయిన  ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్షలను ఇటీవల  ఇంట‌ర్ బోర్డు నిర్వహించిన విషయం  విధిత‌మే.   ఇంట‌ర్ తొలి సంవ‌త్స‌రం ఫలితాలను రేపు విడుదల చేయాలని అధికారులు  ఆలోచ‌న‌లు చేస్తున్నారు.  థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన ఇప్ప‌టికే  పూర్తయినప్పటికీ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన  త‌రువాత‌నే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ  త‌రుణంలోనే ఈ నెల 3 నుంచి 7 వరకు ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు వచ్చే సంవ‌త్స‌రం ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఏప్రిల్‌ నెలలో నిర్వహించాలని ఇప్ప‌టికే అధికారులు యోచించిన‌ట్టు స‌మాచారం. షెడ్యూల్ ప్రకారం  అయితే 2022 మార్చి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగాలి. కానీ ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతుల ప్రారంభం ఆలస్యం కావ‌డంతో ఇంట‌ర్మీడియ‌ట్‌ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించాని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: