బ్రేకింగ్ : టోర్నడో బీభత్సం.. 100 మంది మృతి

N ANJANEYULU
అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించిన‌ది. టోర్నడో ధాటికి సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్ల‌డించారు. రాష్ట్రంలో సుమారు 200మైళ్ల మేర వ‌ర‌కు పలు జిల్లాలను బలమైన టోర్నడో చుట్టేసినట్టు  చెప్పారు.కెంటనీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన టోర్నడోగా దీనిని పేర్కొన్నారు బెషీర్. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపారు.

ఓ క్యాండిల్ ఫ్యాక్టరీలో  ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా పైకప్పు కుప్పకూలడంతో  భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు చెప్పారు. కెంటనీ చరిత్రలోనే అత్యంత దుర్భరమైనదిగా అభివర్ణించారు గవర్నర్. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించారు. సహాయ చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని.. స్థానికంగా ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.  శిథిలాల తొలగింపు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఆ రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు గ‌వ‌ర్న‌ర్ బెషీర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: