ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలలో కృష్ణా నదీ తీరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రతిరోజూ సంధ్యా వందనం చేయడానికి వెళ్లే విద్యార్థులు ఇవాళ కూడా వెళ్లి తిరిగి రాలేదు. కృష్ణానదిలో ఈతకు వెళ్లిన 5గురు విద్యార్థులు అకస్మాత్తుగా ఇవాళ మృత్యువాతపడ్డారు. వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఓ ఉపాధ్యాయుడు అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో కృష్ణానదిలో ఈతకెళ్లారు. ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యార్థులు కృష్ణానదిలో మునిగి మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను వెతికి బయటకు తీపించారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మాదిపాడు సమీపంలోని శ్వేత శృంగాచలం వేద పాఠశాలలో ఐదేండ్ల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నా.. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకరి తరువాత ఒకరూ మునిగిపోయారని.. వారిలో ఇద్దరినీ స్థానికులు కాపాడగా.. ఉపాధ్యాయునితో సహా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి మృతి చెందారు.
మరింత సమాచారం తెలుసుకోండి: