అరుపులూ - కేేకలు...ఎక్కడంటే


తెలంగాణ లో శాసన మండలి ఎన్నికల వేడి రసవత్తరంగా ఉంది. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న శాసన మండలి ఎన్నిక ఏకంగా రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఎం జరుగుతోందో తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు.
ఖమ్మం జిల్లా లో శాసన మండలి కి ఓటు హక్కును వినియోగించుకో నున్న ఎటర్లు కేవలం768 మంది. పోలింగ్ కేంద్రాలు సంఖ్య నాలుగూ. సాధారణంగానే సజావుగా ఎన్నిక జరుగుతుందని భావిస్తాం. ఎందుకంటే అక్కడి ఓటర్ల సంఖ్య ఓ చిన్న పంచాయితీలోని ఓటర్ల సంఖ్య కన్నా తక్కువ కాబట్టి కానీ అక్కడే  అరుపులూ , కేకలు జరిగాయి. కొద్ది సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయుకులు పోలింగ్ కేంద్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని  కాంగ్రెస్ నేతలు పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు.  ఏ మాత్రం ఫలితం లేక పోవడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణలు పెద్ద నినాదాలు చేశారు. దీంతో ప్రతిగా టిఆర్ ఎస్ శ్రేణులు కూడా తమ దైన శైలిలో కేకలు వేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.  దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సర్ద బెట్టారు. స్థానికులు కొందరు ఈ విషయం వాట్సప్ లలో రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఎన్నికల అధికారి జిల్లా యంత్రాగాన్ని అలెర్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: