Crash: ఆర్మీహెలికాప్ట‌ర్ బ్లాక్‌బాక్స్ ల‌భ్యం

N ANJANEYULU
త‌మిళ‌నాడులో బిపిన్ రావ‌త్ దంపల‌తో పాటు నీల‌గిరి కొండ‌ల‌లో ఐఏఎఫ్ చాప‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో మొత్తం 13 మంది మ‌ర‌ణించిన విష‌యం విధిత‌మే. అయితే ఆ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ప్ప‌టి నుంచే ఆర్మీ అధికారులు బ్లాక్‌బాక్స్ కోసం వెత‌క‌డం ప్రారంభించారు. పొగ మంచు కార‌ణంగానే ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇవాళ ఏవిధంగా వాతావ‌ర‌ణం ఉన్న‌దో.. ప్ర‌మాదం స‌మ‌యంలో కూడా అదేవిధంగా ఉండ‌డంతోనే ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్టు ఓ అంచెనాకు వ‌చ్చారు. బ్లాక్‌బాక్స్ ఆధారాల‌తో పూర్తి క్లారిటీ రానున్న‌ది.
ఆరేంజ్ క‌ల‌ర్‌లో ఉంటుంది. కంటికి త్వ‌ర‌గా క‌నిపించ‌డానికి ఆ రంగుతో త‌యారు చేస్తారని.. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో దానిని త‌యారు చేసారు.. అది ఒక మెమోరి కార్డు లాగా చెప్పుకుంటారు. దీని కోసం నిన్న సాయంత్రం, ఇవాళ ఉద‌యం నుంచి గాలింపులు చేప‌ట్టారు. చాప‌ర్ తోక భాగంలో ఏర్పాటు చేస్తుంటారు ఈ బ్లాక్ బాక్స్‌. ఏ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగినా.. తోక భాగంలో ప్ర‌మాదం అంత‌గా సంభ‌వించదు.
దాదాపు 25 గంట‌ల స‌మ‌యాన్ని  రికార్డు చేసుకుంటున్న‌ది బ్లాక్ బాక్స్.  అందులో వారు మాట్లాడే ప్ర‌తి మాట రికార్డు అవుతుంటుంది. ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కో ఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఏటీసీ రూమ్‌తో కీల‌క స‌మాచారం.. ఎలాంటి రిక్వెస్ట్ అక్క‌డికి వెళ్లింది. ఏమి రికార్డు అయ్యాయ‌ని తెలియాల్సి ఉన్న‌ది.   సెర్చ్ ఆప‌రేష‌న్‌లో ఢిల్లీ నుంచి వ‌చ్చిన బృందాల‌కు బ్లాక్ బాక్స్ దొరికిన‌ది. బ్లాక్ బాక్స్‌ను విశ్లేష‌ణ కోసం ఢిల్లీ బృందం తీసుకెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: