ధాన్యం కొనుగోళ్ల పై ఇవాళ సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం

N ANJANEYULU
ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ విషష‌యంపై  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగానే శ‌నివారం ఇవాళ  మొర‌క‌సారి  సమీక్ష నిర్వహించనున్నారు సీఎం.  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్‌ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో ఇవాళ మధ్యాహ్నం  సీఎం ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న‌ రాజ్యసభలో  స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్ల‌డించారు.  తదుపరిగా ఏమి చేయాల‌ని చేయాలనే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: