జ‌గ‌న్ 2.0 : మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గం : మంత్రి బొత్స

N ANJANEYULU
అమ‌రావ‌తి స‌హా రాష్ట్రంలో మూడు ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. కానీ కొంద‌రూ మూడు రాజ‌ధానుల‌పై కోర్టుల‌కు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌ని,  దీంతో రోడ్లు, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న చేయ‌లేక‌పోయాం అని చెప్పారు. అమ‌రావ‌తి రైతుల‌కు ప‌రిహారం, ప్లాట్లు ఇస్తున్నాం అని గ‌త ప్ర‌భుత్వంలో క‌ర‌క‌ట్ట రోడ్డును కూడా టీడీపీ నేత‌లు వేయ‌లేద‌ని బొత్స విమ‌ర్శించారు.

మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గ‌మ‌ని మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. మేము చిత్త శుద్దితో నిర్ణ‌యం తీసుకున్నాం. మ‌రిత మెరుగైన బిల్లుతో ముందుకు వ‌స్తాం అని వివ‌రించారు. న్యాయ‌, చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం తీసుకొస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధే త‌మ ల‌క్ష్యం. వికేంద్రీక‌ర‌ణ స‌రైన‌ద‌ని అనేది మా విధానం అని చెప్పారు. అస‌లు రైతుల‌కు స‌మ‌స్య‌లే లేవ‌ని మంత్రి బొత్స చెప్పడం విశేషం. అభివృద్ధి చేయాల‌నే ధృడ సంక‌ల్పంతోనే ఉన్నామ‌ని, చేయ‌కుండా అడ్డుప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. అమ‌రావ‌తి రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కావం ఉందా లేదా అని మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి బొత్స దాట‌వేసి స‌మాదానం చెప్ప‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: