హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త 20 రోజుల నుంచి వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం విధిత‌మే. ముఖ్యంగా క‌డ‌ప‌, చిత్తూరు, అనంత‌పురం, నెల్లూరు జిల్లాల‌లో వ‌ర్షాలు వ‌ద‌ర‌లు పోటెత్త‌డం.. ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. వ‌ర‌ద దాటికి ప‌లువురు గ‌ల్లంతు కావ‌డం.. ప‌శువులు, గేదెలు, కోళ్లు కొట్టుకుపోవ‌డం చోటు చేసుకునే ఉంటున్నాయి. అయితే తాజాగా హిందూపురం కొట్నూరు చెరువు మ‌రువ వ‌ద్ద తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

 

తూముకుంట గార్మెంట్స్‌కు వెళ్లే ప్ర‌యివేటు బ‌స్సు నీటిలో చిక్కుకు పోయింది. నీటి ప్ర‌వాహం భారీగా ఉన్న స‌మ‌యంలో రోడ్డు దాటేందుకు డ్రైవ‌ర్ ప్ర‌య‌త్నించాడు. బ‌స్సులో దాదాపు 30 మంది మ‌హిళ‌లు ఉన్నారు. స్థానికుల సాయంతో కార్మికులు బ‌య‌ట‌ప‌డ్డారు. భారీ నీటి ప్ర‌వాహం ఉన్న‌ప్పుడు బ‌స్సు డ్రైవ‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచ‌న‌లు చేస్తున్నారు. ఈ పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో మ‌హిళా కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. మ‌రోవైపు తిరుప‌తి రాయ‌ల చెరువు క‌ట్ట తెగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: