చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. వ్యక్తిత్వ హననం సహేతుకం కాదన్నారు. రాజకీయాలు పర్సనల్గా టచ్ చేసే విధంగా ఉండకూడదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నా సోదరి భువనేశ్వరి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం బాధకరమన్నారు. నేను నా సోదరి నైతిక విలువలతో పెరిగామని,పేర్కొన్నారు. విలువల్లో రాజీ పడే ప్రసక్తే లేదని దగ్గుబాటి పురేంధేశ్వరి ట్విట్టర్లో వెల్లడించారు.
మరోవైపు భువనేశ్వరికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సంఘీభావం తెలుపుతున్నారు. వ్యక్తి గత దూషణలకు దిగడం బాధకరమని.. తెలుగు ప్రజలందరూ మీ వెంటే ఉన్నారు మామయ్య అంటూ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని చంద్రబాబుకు ధైర్యం చెప్పారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమనిపేర్కొన్నారు నందమూరి సుహాసిని.