తిరుమల ఘాట్ రోడ్ల మూసివేత
భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొండపైకి రాకపోకలు సాగించే రెండు ఘాట్ రోడ్లను మూసివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. నవంబర్ 17, 18 తేదీలలో తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసివేయగా.. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇవాళ కూడా మూసి ఉంచినట్టు ప్రకటించారు.
అయితే వర్ష తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించనున్నట్టు వెల్లడించారు. అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తుల సౌకర్యార్థం ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలకు అనుమతి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. రేపు ఈ మార్గంలో అనుమతి ఇవ్వడం అనేది వాతావరణం మీద ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.