కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి జ్యోతి రాదిత్య సిందియా నేతృత్వంలో పౌర విమానయాన రంగం వృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై రాష్ట్ర పౌర విమానయాన మంత్రుల సమావేశానికి ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హాజరు అయ్యారు. కేంద్ర ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ని కలిసిన మంత్రి మేకపాటి... ఆ తర్వాత మాట్లాడుతూ వైమనికరంగం ప్రగతి కోసం ఇంధనం పై పన్నును 16 శాతం నుంచి 1శాతానికి తగ్గించడం పాజ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రశంసలు తెలిపారు.
వైమానిక రంగంలో ఏపీ అనేక ఆదర్శనీయ సంస్కరణలు తీసుకువచ్చింది అని ఈ సందర్భంగా కొనియాడారు. మన రాష్ట్ర సమస్యలు మంత్రికి వివరించాము అని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఎన్.ఓ.సి ఇవ్వాలని కోరాం అని తెలిపారు. తిరుపతి,విజయవాడ ఎయిర్పోర్ట్ సర్వీసులను కేంద్రమంత్రికి వివరించాను అని ఆయన అన్నారు. కేంద్ర ఐటి శాఖ మంత్రికి కూడా ఏపీ ఐటి తీరును వివరించాను అని తెలిపారు.