బ్రోకర్లకు శుభాకాంక్షలు ; రాజసింగ్

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన అంశం ఇప్పుడు కాస్త ఆసక్తిగా మారింది అనే చెప్పాలి. ఎందుకు రద్దు చేసింది ఏంటీ అనే దానిపై క్లారిటీ లేకపోయినా సరే అయిదు రాష్ట్రాల ఎన్నికల కోసమే అనే కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి దేశ వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు. అయితే వినూత్నంగా బ్రోకర్లకు శుభాకాంక్షలు చెప్పారు రాజసింగ్. భవిత్యుల్లో రైతులే వ్యవసాయ చట్టాలు కావాలని కోరతారని జోస్యం చెప్పారు ఆయన.

ప్రధాని మోదీ అన్నీ ఆలోచించాకనే నిర్ణయాలు తీసుకుంటారు అని తెలిపారు. రైతుల‌ కష్టాలను బ్రోకర్లు సొమ్ము చేసుకుంటున్నారు అని మండిపడ్డారు. రైతులకు లబ్ధి కోసమే కేంద్రం రైతు చట్టాలను తీసుకొచ్చింది అని పంటల అమ్మకాల్లో బ్రోకర్ల వ్యవస్థకు చెక్ పెట్టాలని ప్రధాని మోదీ ప్రయత్నించారు అన్నారు. రైతు చట్టాల ఆవశ్యకత రాబోయే రోజుల్లో ప్రజలకు అర్థమవుతోంది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: