ఏపీలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సొంత నియోజకవర్గం అయిన మైలవరం లోని కొండపల్లి మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఈ రోజు సైకిల్ పార్టీ దూసుకు పోతోంది. పారిశ్రామికవాడలుగా ఉన్న ఇబ్రహీంపట్నం - కొండపల్లి పంచాయతీ లను కలిపి తొలిసారిగా ఇక్కడ కొండపల్లి మున్సిపాల్టీ గా ఏర్పాటు చేశారు. మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఈ రోజు కౌంటింగ్‌లో టీడీపీ ఇప్పటికే 1,3,4,6,12,13,15,16 మొత్తం ఎనిమిది వార్డులు కైవసం చేసుకుంది. ఇక వైసీపీ 5 7,8,9,14 వార్డుల్లో గెలిచింది. ఇక 10వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక మరో 5 వార్డుల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం మరో 13 వార్డుల్లో కౌంటిం గ్ జరగాల్సి ఉంది. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో ? చూడాలి.