బ్రేకింగ్‌: టీడీపీ - జ‌న‌సేన క‌లిసి చిత్త‌య్యాయి... వైసీపీ ఖాతాలో మ‌రో గెలుపు

VUYYURU SUBHASH
ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక ల కౌంటింగ్ లో అధికార వైసీపీ దూసుకు పోతోంది. గోదావ‌రి టు గుంటూరు, అటు నెల్లూరు - రాయ‌ల సీమ వ‌ర‌కు ప్ర‌తి చోటా వెల్ల‌డి అవుతోన్న ఫ‌లితాల్లో అధికార వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధిస్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోజ‌క‌వ‌ర్గం లో ఆకివీడు న‌గ‌ర పంచాయ‌తీకి తొలిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆకివీడు న‌గ‌ర పంచాయ‌తీ తొలిసారిగా ఏర్ప‌డింది. పైగా ఇక్క‌డ టీడీపీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి రాంబాబు ఉన్నారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 20 వార్డుల‌కు గాను 12 వార్డుల్లో వైసీపీ విజ‌యం సాధించి న‌గ‌ర పంచాయ‌తీ పై త‌న జెండా ఎగ‌ర వేసింది. టీడీపీ , జ‌న‌సేన ఇక్క‌డ క‌లిపి పోటీ చేసినా కూడా ఆ పార్టీ కూట‌మి చిత్తు చిత్తు అయిపోయింది. జ‌న‌సేన‌కు 2 కౌన్సెల‌ర్ సీట్లు రావ‌డం ఉన్నంతో కాస్త ఊర‌ట అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: