ఆ మాట‌లు పొర‌పాటు అని కేంద్ర మంత్రి వెల్ల‌డి : సీఎం కేసీఆర్

N ANJANEYULU
కేంద్ర ప్ర‌భుత్వం ద్వంద ప్ర‌మాణాలు పాటిస్తున్న‌ది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్య‌త దేశ ఆహార అవ‌స‌రాల నిమిత్తం బ‌ఫ‌ర్‌స్టాక్ నిలువ చేసే బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ఉంది. ఎఫ్‌సీఐ వ‌ద్ద ఉన్న గోదాములలో నిలువ చేస్తారు. కేంద్రం ప్రాంతానికో ప‌ద్ద‌తి అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. ఎఫ్‌సీఐ కొంటామ‌ని చెప్పి, కేంద్ర ప్ర‌భుత్వం నిరాక‌రించ‌డం ఏమిట‌ని మంత్రిని క‌లిసాం. సంవ‌త్స‌రానికి తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో స్ప‌ష్టంగా చెప్పండ‌ని అడిగాం. ఎన్ని రోజులు అయినా ఉంటామ‌ని చెప్పాం. అధికారుల‌ను మంత్రి పిలిపించి ఐదారు రోజుల‌లో గ్రూపు ఆఫ్ మినిస్టర్స్‌తో మాట్లాడి స‌మాచారం ఇస్తాం అని చెప్పారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఉలుకు లేదు, ప‌లుకు లేద‌ని సీఎం చెప్పారు.

మంత్రికి రెండు, మూడు సార్లు ఫోన్ కూడ చేసాను. అనుమానాలు త‌లెత్తి.. కేంద్ర ప్ర‌భుత్వం రైతుకు వ్య‌తిరేకంగా ఉందని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి వ‌రి పంట వేయ‌వ‌ద్ద‌ని ప్ర‌క‌ట‌న చేసారు.  రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు వ‌రి పంట వేయండి అని ప్ర‌క‌టించార‌ని,  కేంద్ర మంత్రికి ఫోన్ చేసి అడిగితే అది పొర‌పాటు బండి సంజ‌య్ అలా అన‌డం స‌రికాద‌ని కేంద్ర మంత్రి చెప్పిన‌ట్టు గుర్తు చేసారు కేసీఆర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: