ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు
కొండపల్లిలో 13.85 పోలింగ్ నమోదు అవ్వగా,జగ్గయ్యపేటలో మాత్రం 16.53 శాతం ఓటర్లు ఇప్పటివరకు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. ఓటర్లు కూడ నిబంధనలు పాటించే పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఈనెల 17 అనగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనున్నది.
.