విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది సీఎం జగన్
రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ జరగలేదని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయనిర్థారణలో 2013-14 ధరల సూచితో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వెల్లడించారు సీఎం జగన్. అదేవిధంగా ప్రత్యేక హోదా హామీని కూడ నెరవేర్చలేదని అన్నారు. దీని కోసం ఓ ప్రత్యేక కమిటీని కూడ ఏర్పాటు చేయాలని వివరించారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఏపీ డిస్కం కంపెనీలకు ఊరట కల్పించాలని కోరారు. కీలకంగా ముఖ్యంగా ఏడు అంశాలను సీఎం జగన్ అమిత్ షా ముందు ఉంచారు.