కర్నూలు జిల్లాలో పాస్టర్ అరాచకం.. ప్రేయర్ పేరుతో మైనర్ బాలికలపై..?
ఈ ఘటనకు సంబంధించి వివరాళ్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లాలోని చాగలమర్రి మండలంలో పాస్టర్ పాస్టర్ ప్రసన్న కుమార్ చర్చి నడిపిస్తుంటాడు. ఆప్రాంతంలో నివసించే పెద్దలు పనికి వెళ్లిన సమయంలో బాలికలను ప్రార్థనల పేరుతో చర్చి వద్దకు తీసుకెళ్తుంటాడు. దేవుని కోసం అని కొంతమంది మైనర్ బాలికలు ప్రార్థనల కోసం వెళ్లితే మాత్రం ఆ పాస్టర్ వారితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కొంతమంది బాలికలు పాస్టర్ చేస్తున్న అరాచకాలపై తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తరువాత ఓ వీడియో కూడ సోషల్ మీడియాలో వైరలైంది. ఈ వీడియో ఆధారంగా చాగలమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. పాస్టర్ ప్రసన్న కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్టు చాగలమర్రి పోలీసులు వెల్లడించారు. ఇది ఇలా ఉండగానే బాధితులకు 50 వేలు, పంచాయితీ పెద్దలకు 10 వేలు, పోలీసులకు 5 వేలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నట్టు సమాచారం.