హైదరాబాద్‌లో మరో మహిళ అదృశ్యం
కేసు నమోదు చేసుకొని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు చిక్కడపల్లి పోలీసులు. ముఖ్యంగా సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ తిరిగినట్టుగా పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఆమె దృశ్యాలను గుర్తించారు. పంజాగుట్ట నుంచి మలక్‌పేట వరకు వెళ్లినది. తన వద్ద ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మూసారాంబాగ్ వద్ద రోడ్డుపై పడేసినట్టు గుర్తించారు పోలీసులు. భార్గవికి ఏడాది క్రితమే పెళ్లి జరిగినది. ఆమె ఆచూకి లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళణ చెందుతున్నారు.