నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలో ఎప్ప‌టి నుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌ నిరుద్యోగులకు ముఖ్య మంత్రి కేసీఆర్ శుభ‌వార్త చెప్ప‌నున్నారు. భారీ సంఖ్య లో ఉద్యోగ నోటీఫికేష‌న్ల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. జోన‌ల్ వ్య‌వ‌స్థ లో ఉన్న ఉద్యోగుల ను స‌ర్థుబాటు చేసిన త‌రువాత ఏర్ప‌డిన ఖాళీల వివ‌రాల ప్ర‌కారం.. నోటిఫికేష‌న్ ఉండ‌నున్న‌ద‌ని టీజీవో నేత‌లు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ తో టీజీవో నేత‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో భేటీ అయ్యారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవ‌స్థాప‌క అధ్యక్షులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను  టీజీవో అధ్యక్షులు మమతతో పాటు ప‌లువురు ఉద్యోగులు క‌లిసారు. ఉద్య‌గ నియ‌మాకాల విధానం గురించి సీఎం కేసీఆర్ త‌మకు చెప్పార‌ని టీజీవో నేత‌లు వివ‌రించారు. త్వ‌ర‌లోనే ఖాళీగా ఉన్న పోస్ట్‌ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారని వివ‌రించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డీఏ ను కూడా విడుద‌ల చేయాల‌ని  కేసీఆర్ కు టీజీవో నేత‌లు విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు వెల్ల‌డించారు. సీఎం కూడా  సానుకూలంగా స్పందిచార‌ని ఉద్యోగ సంఘ నేత‌లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: