మీడియా ఛానల్ కు షాక్ ఇచ్చిన పోలీస్ లు, లోకేష్ ఏం అన్నారు...?
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జగన్ సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అని పోలీసుల్ని ప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడం న్యాయమా? అంటూ ప్రశ్నించారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకో? అని నిలదీశారు. ఎండనక, వాననక ఏడుకొండలవాడి సన్నిధికి పాదయాత్రగా వెళ్తుంటే, వారికి సంఘీభావం తెలపడమూ నేరమా? అని ప్రశ్నించారు. పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.