బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?
ప్రజలను బిజెపి తప్పు దోవ పట్టిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ధర్నా ఎందుకు చేస్తున్నారో బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. ధర్నా చేయాల్సింది తెలంగాణ లో కాదు ఢిల్లీలో అని బీజేపీ అబద్ధాల మీద బతుకుతోంది అన్నారు. ఎఫ్సీఐ ధాన్యం కొనకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇంటి ముందు చేస్తాం అని స్పష్టం చేసారు. బిజెపి దొంగ మాటలు, దొంగ దీక్షలు నమ్మొదు అని కోరారు. యాసంగి పంట కొనం అని ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారు అన్నారు.