బుల్లెట్ బండి మీద హాట్‌కేకుల్లా శాండ్‌విచ్ అమ్ముడు.. వీడియో వైర‌ల్..!

N ANJANEYULU
ఇప్ప‌టివ‌ర‌కు  ఎన్ని కొత్త బండ్లు వ‌చ్చినా కానీ బుల్లెట్బండికి మాత్రం క్రేజ్ తగ్గ‌లేదు. ఇప్పుడు బుల్లెట్ బండిమీద వ‌స్తున్న పాట‌లు చాలా వైర‌లవుతున్నాయి. బుల్లెట్ బండి ఉంటే చాలు, వాళ్ల రేంజ్‌ వేరుగా ఉంటుందని అంటుంటారు. అయితే బుల్లెట్ బండి అంటే కేవ‌లం ప్రెస్టేజ్ కోస‌మే కాదు.. దాని ద్వారా నాలుగు డ‌బ్బులు కూడా సంపాదించొచ్చ‌ని, స్వ‌యం ఉపాధి కూడ పొందొచ్చ‌ని నిరూపించాడు సూర‌త్‌కు చెందిన ఓ వ్య‌క్తి.
ఇత‌న్ని శాండ్‌విచ్ వాలే బుల్లెట్ రాజా అని కూడా పిలుస్తుంటారు.  సాయంత్రం అయిందంటే చాలు త‌న బుల్లెట్ బైక్ మీద డుగ్ డుగ్ అంటూ  సూరత్‌ మెయిన్‌ మార్కెట్‌కు వ‌స్తుంటాడు. శాండ్‌విచ్‌ను త‌యారు చేసే సామాగ్రిని బుల్లెట్‌కు ఎటాచ్‌ చేసిన మరో బండిలో తెచ్చుకుంటాడు.  బుల్లెట్ బండిని ఆపి త‌న స‌రంజామా అంతా బ‌య‌ట‌కు తీసి పొయ్యి వెలిగించి శాండివిచ్ త‌యారు చేసి అమ్ముతుంటాడు. అత‌ని స్పెష‌ల్ చార్‌కోల్ బుల్లెట్ శాండివిచ్‌కు చాలా మంది అభిమానులు కూడ ఉన్నారు. సూర‌త్ లో శాండివిచ్ కావాలంటే చాలా వ‌ర‌కు ఈ వ్య‌క్తి బుల్లెట్ బండి వ‌ద్ద‌కు రావాల్సిందే. అయితే ఈ వీడియో యూట్యూబ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో బుల్లెట్ శాండివిచ్ వీడియో తెగ వైర‌ల‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: