టీడీపీ నేతలపై కేసులు నమోదు..మాజీ మంత్రి ఫైర్‌...!

N ANJANEYULU
చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలు 18 మందిపై ప‌లు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. కుప్పం మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారంటూ 18మంది టీడీపీ నేతలపై కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసారు. మ‌రోవైపు శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అంటూ మాజీ మంత్రి అమరనాథరెడ్డి పోలీసులు పై ఫైర్ అయ్యారు. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశామన్నది అవాస్తవం అని.. క‌మిష‌న‌ర్ చిట్టిబాబు వైసీపీ తొత్తుగా మారార‌ని పేర్కొన్నారు అమ‌ర‌నాథ‌రెడ్డి.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆదేశాల‌తో క‌మిష‌న‌ర్ చిట్టిబాబు ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు పులివ‌ర్తి నాని కూడ కేసుల వ్య‌వ‌హారంపై  ఫైర‌య్యారు.  కుప్పంలో ప్రజాస్వామ్యబద్థంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది అని, వైసీపీ నాయ‌కులు నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప్రతిప‌క్ష నేత‌పై వైసీపీ బూతు పురాణం బాధ‌క‌రం అని వెల్ల‌డించారు. టీడీపీ నేత‌ల‌కు సంస్కారంగా మాట్లాడ‌డం మాత్ర‌మే తెలుసు అని పేర్కొన్నారు పులివ‌ర్తి నాని.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: