ఆ ధ‌ర‌ఖాస్తులు నేటి నుంచే ప్రారంభం

N ANJANEYULU
పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌లో సీఎం ప్ర‌క‌టిన విష‌యం విధిత‌మే. పోడు భూముల కోసం రాష్ట్రవ్యాప్తంగా గిరిజ‌నులు, పేద‌లు గ‌త కొంత కాలంగా ఉద్య‌మం చేప‌డుతున్నా త‌రుణంలో ప్ర‌భుత్వం వారికి మేలు చేసే విధంగా ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ది. 2005లోనే ఆర్వోఎఫ్ చ‌ట్టం వ‌చ్చినా అప్పుడు కేవ‌లం కొంత మందికి మాత్ర‌మే న్యాయం జ‌రిగిన‌ది. మ‌రికొంత మందికి న్యాయం జ‌ర‌గ‌క‌పోగా, ప‌ట్టాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో వారు చాలా కాలంగా ప్ర‌భుత్వానికి మొర పెట్టుకోవ‌డంతో,   ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని  సీఎం కేసీఆర్ అసెంబ్లీలో నిర్ణ‌యించారు.

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్క‌రం కోసం ఇవాళ అన‌గా న‌వంబ‌ర్ 08, 2021 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్న‌ది. నిర్ణిత షెడ్యూల్ ప్ర‌కారం, అర్హ‌త క‌లిగిన గిరిజ‌నుల స‌మ‌స్య‌ను వీలైనంత త్వ‌ర‌గా తీర్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటొంది ప్ర‌భుత్వం. గ్రామ‌స‌భ‌లు, స‌బ్‌డివిజ‌నల్‌, జిల్లా క‌మిటీల ఆమోదానికి ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసిన‌ది. రాష్ట్రంలో దాదాపు పోడు భూముల స‌మ‌స్య 2,450 గ్రామాల‌లో ఉన్న‌ద‌ని ప్ర‌భుత్వం ఒక అంచెనాకు వ‌చ్చింది. ముఖ్యంగా ధ‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ తీసుకొని  స‌ర్పంచ్ చైర్మ‌న్‌గా, పంచాయ‌తీ సెక్రెట‌రీ కార్య‌ద‌ర్శిగా ధ‌ర‌ఖాస్తుల‌ను గ్రామ‌స‌భ‌లో తీర్మాణం చేయ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: