మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం..!

N ANJANEYULU
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస‌గా సినిమాల‌తో బీజీగా త‌న జోష్‌ను పెంచుతున్నారు. ఇప్ప‌టికే ఆచార్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ది. లూసిఫ‌ర్ రిమేక్‌ సెట్స్ మీద ఉంది. వీటితో పాటు తాజాగా బాబీ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న చిరంజీవి ఇవాళ దానికి కొబ్బరికాయ కొట్టారు. మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కనున్న సినిమా నేడు పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయింది.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ ముహుర్త‌పు స‌న్నివేశాన్ని ఓపెనింగ్ చేశారు. అదేవిధంగా మెగాస్టార్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను కూడ విడుద‌ల చేసారు. కండ్ల‌కు గాగుల్స్‌, చేతిలో సిగ‌రేట్‌తో మాస్ లుక్‌తో అద‌ర‌గొట్టాడు చిరంజీవి. మెడ‌లో పెద్ద గొలుసులు వేసుకొని స్టైల్‌గా లెట‌ర్ ప‌ట్టుకున్న చిరు లుక్ ఆక‌ర్షిస్తున్న‌ది. అరాచ‌కం ఆరంభం అంటూ సినిమా పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ఇప్పుడు ఈ పోస్ట‌ర్  విడుద‌లైన కొద్ది క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట‌ర్ చూసిన వారంద‌రూ ముఠా మేస్త్రీ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. మాస్ మూల విరాట్ అవ‌తారంలో అన్న‌య్య అరాచ‌కం మొద‌లు అంటూ ద‌ర్శ‌కుడు బాబీ ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రానికి వాల్తేరు వీర‌య్య అనే పేరు ఖరారు చేసిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది ఈ సినిమా.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: