రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
దేశవ్యాప్తంగా ఇటీవల నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోయిన కేంద్రప్రభుత్వం.. తాజాగా దీపావళి పండుగ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినది. అందుకు కొందరు ఈ ఎన్నికలే కారణం అని పేర్కొంటున్నారు. రాజకీయంగా బీజేపీకి ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కీలకం కానున్నాయి. కోవిడ్-19 ప్రోటోకాల్ అనుసరిస్తూ హైబ్రిడ్ విధానంలో సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ పదాధికారులు, కేంద్ర మంత్రులు, ఢిల్లీ నేతలు ఎన్డీఎంసీ సెంటర్లో ప్రత్యక్ష భేటీ కానున్నారు. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల కార్యాలయాల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవ్వనున్నారు.