ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

N ANJANEYULU
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ వీసీ స‌జ్జ‌నార్ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు విశ్వ‌ ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప‌రిశీలించ‌డ‌మే కాకుండా దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. అయితే ఆయ‌న న‌ల్ల‌గొండ ఆర్టీసీ డిపోలో ఆకస్మిక తనిఖీ చేప‌ట్టారు సజ్జనార్‌.  దీనితో పాటు అధికారులతో ఆర్టీసీ ఎండీ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని.. రైతులకు కూడా ఉపయోగపడేలా కార్గో సేవలు అందినున్నాం అని తెలిపారు స‌జ్జ‌నార్‌.  రెండేండ్లుగా  30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ పై భారం పడిందన్న ఆయన వెల్ల‌డించారు.

 సురక్షితంగా ప్రయాణం ఆర్టీసీ బస్సుతోనే సాధ్యం అని, మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సు వెళ్తుందని గుర్తుచేశారు. ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ఫోన్ చేస్తే వారి వద్దకే వెళ్లి బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం క‌ల్పిస్తున్నాం అని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.  బస్టాండ్ ఆవరణలో, ఆర్టీసీ ఆస్తులపై సినిమా, అనుమతి లేని పోస్టర్లు అంటించితే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చిరించారు.  పోస్ట‌ర్ల‌పై ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌లో కేసులు నమోదు  కూడ చేశాం అని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండ‌గా మ‌రో వారం రోజుల్లోనే ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచ‌నున్నార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆర్టీసీని గాడి పెట్టి.. పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌డం కోసం స‌జ్జ‌నార్ ముందుకు సాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: