కొర‌డాతో కొట్టించుకున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం..! ఎందుకో తెలుసా..?

N ANJANEYULU
ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాన్ని ప‌రిపాలించే ముఖ్య‌మంత్రి భూపేశ్‌ బఘేల్‎ కొర‌డాతో కొట్టించుకోవ‌డం ఏమిటి అని అనుకుంటున్నారా..? ఇది అక్ష‌రాల స‌త్యం. ఏదో స‌ర‌దా కోస‌మో లేక ఏదైనా త‌ప్పు చేసినందుకు శిక్ష‌గానో ఈ దెబ్బ‌లు కొట్టించుకోలేద బ‌ఘేల్‌. ఒక దేవాల‌యంలో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న పాల్గొన్నారు. అక్క‌డ సాంప్ర‌దాయం ప్ర‌కారం దెబ్బ‌లు కొట్టించుకోవ‌డం ఆన‌వాయితీ అంట‌. అందుకే ఆ ముఖ్య‌మంత్రి ఇలా చేశారు.

వివ‌రాల‌లోకి వెళ్లితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్‌లో ప్రతీ సంవ‌త్స‌రం  ఆడంబ‌రంగా గోవర్ధన్ పూజ నిర్వ‌హిస్తుంటారు. ఈ పూజ‌లో గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ త‌రువాత పూజ అనంత‌రం  భ‌క్తులు కొరడాతో కొట్టించుకుంటారు.  గోవ‌ర్ధ‌న్ పూజ ముగిసిన త‌రువాత‌ కొరడా దెబ్బలు తింటే స‌మ‌స్య‌లు తొలగిపోతాయని అక్క‌డి ప్ర‌జ‌ల నమ్మకం. ఈ నేప‌థ్యంలోనే ఇవాళ దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవ‌ర్ధ‌న్ పూజ‌కు హాజ‌రైన బ‌ఘేల్ కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు.

అయితే  సీఎం భూపేశ్ బ‌ఘేల్‌ను జంజిగిరి గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ కొరడాతో కొట్టారు.  ఆ త‌రువాత సీఎం బ‌ఘేల్ మాట్లాడారు. గోవును పూజించే ఈ గోవ‌ర్ధ‌న్ పూజా కార్యాక్ర‌మం చాలా గొప్ప సంప్ర‌దాయం అని పేర్కొన్నారు. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను మ‌రిచిపోకుండా భావిత‌రాల‌కు అంద‌జేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని సీఎం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: