నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడు ఎప్పుడని ఎంతగానో ఆతృతతో ఎదురు చూస్తున్న టాక్ షో దీపావళి పండుగ సందర్భంగా ప్రసారమవుతోంది. మొదటి ఎపిసోడ్ లో బాలయ్య అదరగొడుతున్నారు. ప్రోమో వచ్చిన నాటి నుంచేబాలయ్య టాక్ షో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ముఖ్యంగా సినిమాల కంటే ఈ టాక్ షో ప్రోమో లోనే బాలయ్య చాలా అందంగా కనిపిస్తున్నారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బాలయ్యని మోహన్‌బాబు ఈ విధంగా ప్రశ్న అడిగాడు. నీ మీద డైరెక్టర్ వంద మంది ముందు కేకలు వేస్తే నువ్వేం చేస్తావ్ అని మోహన్‌బాబు అడిగిన ప్రశ్నకు బాలయ్య ఈ విధంగా సమాధానం చెప్పాడు. నేను డైరెక్టర్ స్టూడెంట్‌ను. ఆయన ఏది చెబితే అది చేస్తా అని పేర్కొన్నాడు బాలయ్య. స్కూల్‌లో టీచర్ చెప్పినట్టు విద్యార్థి ఎలా వింటాడో ఇక్కడ నేను కూడ అలాగే అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా నేను చాలా సీరియస్ ప్రశ్న అడుగుతాను అని బాలయ్య అన్నాడు నీకు సీరియస్ ఏమో గాని నాకు కాదన్నాడు మోహన్ బాబు. నీకు సీరియస్ ఏమో గాని నాకు సరదా ప్రశ్న అవుతుందేమో అన్నాడు.