కేసీఆర్ Vs ఈటెల : బబోరి రేవంత్ ను ఆదుకున్న జగ్గారెడ్డి

N ANJANEYULU
హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి బల్మూరి వెంకట్‌ను బలి పశువును చేశారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేవ‌లం వెంక‌ట్ ను  అభ్య‌ర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్‌, ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క ఇద్ద‌రూ క‌లిసి మాత్ర‌మే నిర్ణ‌యించారని వెల్ల‌డించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించినా.. లేదా డిపాజిట్ ద‌క్కించుకున్న అది రేవంత్‌రెడ్డి వ‌ల్ల‌నే వ‌చ్చింది అనే వార‌ని తెలిపారు. ఇప్పుడు మేము ఎవ్వ‌రం వెళ్ల‌క‌పోవ‌డం మూలంగానే డిపాజిట్ కూడ ద‌క్క‌లేద‌ని రేవంత్ అభిమానులు పేర్కొంటున్నట్టు జ‌గ్గారెడ్డి వివ‌రించారు.

ఇప్ప‌టికే జ‌గ్గారెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, మ‌ధుయాష్కి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిలు స్పందించారు. రేవంత్ రెడ్డి మూలంగానే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓడిపోయింద‌ని కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను అధిష్టానం గురించి తీసుకెళ్తాన‌ని వెల్ల‌డించారు. దుబ్బాక, నాగార్జునసాగర్‌లో పని చేసినట్టుగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పని చేయలేదని కోమటిరెడ్డి అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కార్య‌క‌ర్త‌లు అధ్యైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని, ఎల్ల‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని హామి ఇచ్చారు కోమ‌టిరెడ్డి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: