చనిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెట్టడమేంటి..?
పవన్ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌ను ఉద్యమం చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. తాజాగా పవన్‌కు జ్ఞానోదయం కలిగి విశాఖ ఉక్కు పరిరక్షణకు ముందుకు వచ్చినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు ప్రకటించారు నాని. రాష్ట్రంలో డెడ్ పార్టీ అయిన జనసేన మాకు డెడ్‌లైన్ ఏమి పెడుతుందని పేర్కొన్నారు. కేంద్రానికి వెళ్లి పవన్ మోడీకి డెడ్‌లైన్ పెడితే ఏమైనా భయపడతారేమోనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీలు టీడీపీ, జనసేనలు అని.. వాటి డెడ్లైన్లకు మేము భయపడమని వెల్లడించారు.