తెలంగాణలో హుజూరా బాద్లో
బీజేపీ క్రమ క్రమంగా తన ఆధిక్యం పెంచుకుంటూ పోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో మాత్రం అధికార టీఆర్ ఎస్
పార్టీ ఏకంగా 500 పై చిలుకు ఓట్ల మెజార్టీ సాధించింది. అయితే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభ మైనప్పటి నుంచి
బీజేపీ ఆధిక్యంలోకి వచ్చేసింది. తొలి రెండు రౌండ్లలో స్వల్ప మెజార్టీతో ఆధిక్య త సాధించిన
బీజేపీ మూడో రౌండ్లో కూడా మెజార్టీ సాధించింది. మూడో రౌండ్ పూర్తిగా నియోజకవర్గ కేంద్రమైన హుజూరా బాద్ మున్సిపాల్టీ కి సంబంధించిన కౌంటింగ్. దీనిని బట్టి హుజూరా బాద్ మున్సిపాల్టీ లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చినట్లు అయ్యింది. వాస్తవంగా ఈ మున్సిపాల్టీ తో పాటు హుజూరా బాద్ మండలంలో తమకు మెజార్టీ వస్తుందని టీఆర్ ఎస్ వేసుకున్న అంచనాలు తప్పాయి.