హుజూర్ ఉప ఎన్నికల సర్వేలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు..!

frame హుజూర్ ఉప ఎన్నికల సర్వేలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు..!

MOHAN BABU
హుజురాబాద్ లో  ఇప్పటివరకు ఎంతో ఉత్కంఠగా సాగిన  ఉప ఎన్నికల పోలింగ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గత మూడు నెలల నుంచి దేశంలోని అందరిచూపు హుజురాబాద్ ఉప ఎన్నిక పైనే ఉంది. కానీ ప్రస్తుతం  హుజురాబాద్ ఎగ్జిట్ పోల్స్ ఈ పార్టీ వైపే ఉన్నాయని కౌటిల్య సొల్యూషన్స్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది.  అయితే ఇప్పటివరకు హుజురాబాద్ లో అనేక సర్వే సంస్థలు సర్వే నిర్వహిస్తూనే ఉన్నాయి. కానీ ఈ ఫలితాలలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య చాలా తక్కువ వ్యత్యాసం తోనే ఏదో ఒక పార్టీ విన్ అవుతుందని తెలియజేశారు. కొన్ని ఫలితాలు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పగా, మరికొన్ని సర్వేల్లో వచ్చినటువంటి ఫలితాలు బిజెపి పార్టీ గెలుస్తుందని తెలియజేశాయి. కానీ ఇప్పటివరకు  సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల్లో మూడు నుంచి ఐదు శాతం తేడాతోనే బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగుతుందని తెలియజేశాయి. దీంతో రెండు పార్టీలు హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హోరాహోరీగా తమదైన శైలిలో ప్రచారాన్ని చేసుకున్నారు.


ప్రచార గడువు ముగిసిన తర్వాత ప్రలోభాల పర్వం కూడా మొదలు పెట్టారు. చివరికి అది ముగిసి ఈరోజు ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. మరి ఎన్నికల్లో ఏ పార్టీ విజయ తీరం వైపు దూసుకెళ్ళిందో కౌటిల్య సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఈ విధమైన ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా..హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కౌటిల్య సొల్యూషన్స్ వారు నిర్వహించిన సర్వే ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది కూడా తెలియజేశారు.


హుజురాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 237000 మంది. ఇందులో ఈరోజు జరిగిన పోలింగ్  84% పూర్తయింది. 199080 ఓట్లు పోలయ్యాయి. ఇందులో  బిజెపి పార్టీకి 47% అంటే 93567 ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అక్కడ తెరాస పార్టీకి 40% అంటే 79632 ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 8% అంటే 15226 ఓటు వచ్చాయని తెలుస్తోంది. ఇతరులకు 5% అంటే 9950 ఓట్లు పడ్డాయని కౌటిల్య సొల్యూషన్స్ వారు నిర్వహించిన సర్వేలో వెల్లడైందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: