రిగ్గింగ్ చేసి ఏం సాధిస్తార్రా! తూ మీ బ చె

RATNA KISHORE

రెండు ప్రాంతాల‌లో నాయ‌కులు ఇవాళ ముచ్చెమ‌ట‌లు పోస్తున్నారు. రెండు ప్రాంతాల‌లో నాయ‌కులు ఏం జ‌రిగినా ఎదుర్కొనేంత శ‌క్తితో ఉన్నారు. ఆఖ‌రి నిమిషంలో ప్ర‌తాపం చూపేందుకు సిద్ధం అయిపోతున్న వేళ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థే అప‌హాస్యం కానుంది. ఇదే త‌రుణంలో బద్వేలు, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల‌లో కీల‌కంగా కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నా యి. పోలింగ్ శాతం అన్న‌ది హుజురాబాద్ లో ఇప్ప‌టి దాకా 61శాతంపైగానే ఉంది. బ‌ద్వేలు పోలింగ్ శాతం ఆశించినంత‌గా లేద‌ని తెలుస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ బ‌ద్వేలులో, హుజురాబాద్లో రిగ్గింగ్ అవ‌కాశం ఎక్కువ‌గానే ఉంద‌ని కొంద‌రు ప‌రిశీల‌కులు చెబుతున్నా రు. స్థానికులు కాని వారిని త‌ర‌లిస్తూ పెద్ది రెడ్డి త‌న హ‌వా చూపిస్తే, ఇక్క‌డ అధికారం పేరిట గులాబీ దండు హ‌వా ఒక‌టి న‌డుస్తోంది. ఈ రెండు ప‌రిణామాలు కూడా ప్ర‌జా స్వామ్యానికి మాయ‌ని మ‌చ్చే.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: