జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ
సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలను విచారణ జాబితాలో చేర్చింది ఉన్నత న్యాయస్థానం. కింది కోర్టు విచారణలో, 12 చార్జ్ షీట్లలో నిందితులుగా ఉన్న పలు సంస్థల వ్యక్తులు, వారిపైన నమోదైన కేసులను కొట్టేయాలని, స్టే ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ధర్మాసనం రోజు వారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది.