నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

N ANJANEYULU
నేడు యాదాద్రి పుణ్య‌క్షేత్రాన్ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు సంద‌ర్శించ‌నున్నారు. తొలుత బాలాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి..ఆ త‌రువాత ప్ర‌ధాన ఆల‌యానికి సంబంధించిన ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ప్ర‌ధాన ఆల‌యం ముఖ‌ద్వార బంగారు తాప‌డం, ధ్వ‌జ‌స్థంభం, బ‌లిపీఠం, ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. ద‌ర్శ‌న కాంప్లెక్స్‌, క్యూకాంప్లెక్స్‌, విష్ణువుపుష్క‌రిణి, పార్కింగ్ ప‌నుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేయన్నార‌ని స‌మాచారం.
అదేవిధంగా ఆల‌యం పునఃప్రారంభానికి సంబంధించిన తేదీ, ముహుర్తాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. హైద‌రాబాద్ నుంచి ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతారు. ఇప్ప‌టికే యాదాద్రి ఆల‌యం ప‌నులు పూర్తిగా ముగిసిన సంద‌ర్భంగా ఈరోజు అన్నింటిని సీఎం ప‌ర్య‌వేక్షించనున్నారు. ఇప్ప‌టికే ఆల‌యం పునఃప్రారంభం ముహూర్త‌మును చిన‌జీయ‌ర్ స్వామి నిర్ణ‌యించార‌ని, స్వ‌యంగా యాదాద్రిలోనే ప్ర‌క‌టిస్తారు. ఆల‌యంలో నిర్వ‌హించే యాగాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను కూడ వెల్ల‌డించ‌నున్నారు సీఎం. సీఎం కార్యాల‌యం నుంచి ఈ వివ‌రాల‌కు సంబంధించిన‌ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: