ద‌ళిత బంధు నిధులు విడుద‌ల‌

N ANJANEYULU
ద‌ళితుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విధిత‌మే. ఇందుకోసం గ‌తంలో నాలుగు మండ‌లాల‌ను ఎంపిక చేశారు. వాటికి సోమ‌వారం ప్ర‌భుత్వం నిధుల‌ను విడుద‌ల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్ర‌కారం రూ.250 కోట్లు విడుద‌ల అయ్యాయి. ఆర్థిక‌శాఖ‌కు సంబంధించిన ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు  నిధుల ఉత్త‌ర్వుల‌ను విడుద‌ల చేశారు.

 
ఖ‌మ్మం జిల్లాలోని మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న చింత‌కాని మండ‌లానికి రూ.100 కోట్లు, సూర్య‌పేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తిరుమ‌ల‌గిరి మండ‌లానికి రూ.50కోట్లు విడుద‌ల చేశారు. అదేవిధంగా నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లా క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని చార‌గొండ మండ‌లానికి రూ.50 కోట్ల‌ను, కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని నిజాంసాగ‌ర్ మండ‌లానికి రూ.50కోట్లకు సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేసిన‌ట్టు ఉత్త‌ర్వులలో వెల్ల‌డించారు.  మ‌రో వైపు ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసేవ‌ర‌కు బంద్ చేయాల‌ని తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. దీంతో విడుద‌ల చేసిన నిధులు ఇప్పుడు అకౌంట్‌లో జ‌మా అవుతాయా..?  లేక  ఎన్నిక‌లు ముగిసాకనా అని కొంత మంద ప్ర‌జ‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: