మావోయిస్ట్ అగ్ర నేత ఆర్కే మృతదేహం ఫోటోలు రిలీజ్...!

మావోయిస్ట్ అగ్ర నేత ఆర్కే రెండు రోజుల క్రితం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆర్కే మొన్న కిడ్నీ లు ఫెయిల్ కావడంతో తుది శ్వాస విడిచారు. దీనిపై నిన్న మావోయిస్ట్ పార్టీ అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇక నేడు మావోల నుంచి ఆర్కే మృతదేహం ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ... అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు చెప్పింది. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగాయని నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి అని వెల్లడించింది. అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు... మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk

సంబంధిత వార్తలు: