వీరికి కొవిడ్ ముప్పు ఎక్కువ‌?

Garikapati Rajesh

చిన్న చిన్న తెగ‌లు, చిన్న చిన్న స‌మూహాల‌కు కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉంటుంద‌ని ఒక ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఈ స‌మూహాలు, తెగ‌లు అండ‌మాన నికోబార్ దీవుల‌తోపాటు అడ‌వులు, కొండ ప్రాంతాల్లో నివ‌సిస్తుంటారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక తెగ ఉంది. వీరంతా వారిలో వారే వివాహం చేసుకోవ‌డంవ‌ల్ల జ‌న్యుప‌ర‌మైన వైవిధ్యం ఉండ‌దు. వీరికి పుట్టే సంతానంలో జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉత్ప‌న్న‌మ‌వుతుంటాయి. ఇప్ప‌టికే క‌రోనా అనేది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వివిధ జాతులు, తెగ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. కొవిడ్ సోకితే వీరిలో మ‌ర‌ణాల రేటు కూడా ఎక్కువ‌గా ఉంటోంది. బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ ప‌రిశోధ‌కులు ఈ అధ్య‌య‌నంలో పాల్గొన్నారు. మొద‌టిసారి జీనోమ్ డేటా ఆధారంగా విశ్లేష‌ణ చేశారు. ఈ తెగ‌లు, స‌మూహాలు ప్ర‌జ‌ల్లోకి రాకుండా చూసుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మంటున్నారు. వీరిలో వీరే వివాహాలు చేసుకోవ‌డం, జ‌న్యు వైవిధ్యం లేక‌పోవ‌డంవ‌ల్ల కొవిడ్ ముప్పు ఎక్కువ‌గా ఉంటోంది. 227 జాతుల‌కు చెందిన 1600 మంది వ్య‌క్తుల జ‌న్యుక్ర‌మాల‌ను ప‌రిశోధ‌కులు విశ్లేషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: