కొత్త సలహహాదారుడు వచ్చాడోచ్

కొత్త సలహహాదారుడు వచ్చాడోచ్  
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సలహాదారుల జాబితాలో మరో వ్యక్తి నియమితులయ్యారు.  ఈయన పేరు అమిత్ ఖురే.1985 ఝార్ఖండ్ ఐ.ఏ.ఎస్ క్యాడర్ కు చెందిన అధికారి.  సెప్టెంబర్ 30 వ తేదీ బ్యూరోక్రాట్ పదవి నుంచి విరమణ పొందారు. వివాదాస్పద ఐ.ఎ.ఎస్ అధికారిగా పేరుపొందారు.  ఈయన చివరి పోస్టింగ్ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి. ఈ సమయంలోనే ఆయ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకు వచ్చారు.  ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలన్న విషయం పై దేశ వ్యాప్తంగా  సూధీర్ఘకాలం పాటు చర్చించారు. ఈ విషయంలో మాత్రం ఆయన సేవలను ప్రతిపక్షాలు సైతం కొనియాడాయి.
అంతకు ముందు అమిత్ ఖురే సమాచార ప్రసార శాఖలో కార్యదర్శి హోదాలో పని చేశారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చాలా వివాదాస్పదం అయ్యాయి. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా పై ప్రభుత్వ పెత్తనం లాంటీ నిర్ణయాలు భారత్ లో తొలి సారి అమిత్ ఖురే హయాం లోనే రూపుదిద్దుకున్నాయి.  సమాచార శాఖ కార్యదర్శిగా ఈయన తీసుకున్న నిర్ణయాలను ఎడిటర్స్ గిల్ట్ కూడా వ్యతిరేకించింది. పాత్రికేయ సమాజం పై నియంత్రణలు ఏంటంటూ మండి పడింది. తరువాతి కాలంలో అమిత్  ఉన్నత విద్యాశాఖకు మరారు. గత నెలలో పదవీ విరమణ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో లాబీ ఉన్న వ్యక్తి కావడంలో ఈయన తిరిగి ప్రధాన మంత్రి సలహాదారుల్లో ఒకరుగా నియమితులయ్యారు.  రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.  అమిత్  ఇక నుంచి పి.ఎం.ఓలో కార్యదర్శి హోదాలో పనిచేయనున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: