ఇది అందరి విజయం : మోహన్ బాబు
వేదిక దొరికిందని ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అలా అని మౌనంగా ఉన్నానని అసమర్థుడు అనుకోవద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనమే దిగజారిపోతాం అని పేర్కొన్నారు. నిన్నటిది వేస్ట్.. ఈరోజు న్యూస్.. రేపు క్వశ్చన్పేపర్ అని మోహన్‌బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిల సహకారంతో అభివృద్ధి సాధించాలని కోరారు. మా అనేది ఒక కుటుంబం. అందరిదీ ఒకే పార్టీ అని చెప్పుకొచ్చారు మోహన్‌బాబు.