అమానుష పాల‌న జ‌గ‌న్ ది : ప‌వ‌న్

RATNA KISHORE
హైద్రాబాద్ కేంద్రంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి విచ్చేసి, శ్రేణుల‌ను  ఉత్సాహ ప‌రుస్తూ, ముందున్న కాలంలో ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడాల‌ని, పోరాడాల‌ని పిలుపునిస్తూ, ఈ ప్రాంత వీరుల స్ఫూర్తితో ప‌నిచేయాల‌ని దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారంటే..ఆయ‌న మాటల్లోనే...

 
"మీ గుండె బ‌ల‌మే నా బ‌లం. నా  బ‌లం డ‌బ్బు కాదు..జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లే నా బ‌లం.ధైర్యం సాహ‌సాలు ఉన్న‌వాడే రాజ‌కీయాలు చే యగల‌డు. ఆంధ్రాలో జ‌న సైనికులపై అమానుష దాడులు జ‌రుగుతున్నాయి. క‌ర్ర‌ల‌కు మేకులు కొట్టి ఒళ్లు చీరిపోయేలా కొడుతు న్నారు. అయినా వాళ్లు నిల‌బ‌డుతున్నారు. తెలంగాణ నేల పై ఉన్న మీకు నేను ఉద్య‌మం నేర్పాలా? ఉద్య‌మ విద్యుత్ ఒళ్లంతా ప్ర వ‌హిస్తున్న మీకు నేను వేరేగా చెప్పాలా? నేను మీ నుంచి నేర్చుకున్నాను. నేర్చుకుంటున్నాను. ఆంధ్ర నాకు జ‌న్మ‌నిస్తే, తెలంగా ణ నాకు పున‌ర్జ‌న్మ ఇచ్చింది.."అని చెప్పారు. ప్ర‌సంగంలో భాగంగా కేసీఆర్ మొద‌లుకుని సంజ‌య్ వ‌ర‌కూ అన్ని పార్టీల నాయకు ల పేర్ల‌నూ ప్ర‌స్తావించారు. వారు బ‌లమైన నాయ‌కుల‌ని కీర్తించారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయ‌కులు వీహెచ్ ప్ర‌స్తావ‌న కూడా తీసు కువ‌చ్చారు. గ‌తంలో పీఆర్పీ స‌మ‌యంలో వీహెచ్ పై చేసిన విమ‌ర్శ‌ల కార‌ణంగా అప్పుడు ప‌వ‌న్ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఈ సారి మాత్రం ఆయ‌న పేరు మాత్రం ప్ర‌స్తావించి వ‌దిలేశారు. ప్ర‌సంగంలో భాగంగా గుంటూరు శేషేంద్ర క‌విత్వం వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: