ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీ ప్రాంతంలో జరిగే హింసాకాండ జరిగిన విషయం విధితమే. హింసాకాండలో రైతులు మరణించారు. లఖింపూర్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన
ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ సర్కార్
అరెస్ట్ చేసిన విషయం విధితమే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే రాహుల్‌గాంధీ లఖింపూర్ఖేరీకు వెళ్లనున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై
కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఎలాంటి నోటీసులు లేకుండా ప్రియాంకగాంధీని
అరెస్ట్ చేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంకగాంధీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతులపై
బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. లఖింపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు
రాహుల్ అనుమతి కోరినా యూపీ సర్కారు నిరాకరించింది. అనుమతి లేకున్నా
రాహుల్ మాత్రం ఖచ్చితంగా వెళ్తానని ప్రకటించాడు.
రాహుల్ ఐదుగురు మంది సభ్యులతో కలిసి లఖింపూర్ వెళ్లనున్నారు. రాహుల్‌ను వెళ్లనిస్తారా లేక
అరెస్ట్ చేస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.