జ‌గ‌న్ అడిగినందుకే ఆంధ్ర‌జ్యోతిపై కేసు?

Garikapati Rajesh

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆంధ్రజ్యోతిపై వేసిన కేసులో అసలు విష‌యం చెప్పారు. జ‌గన్ కోరిక మేరకే ఆంధ్రజ్యోతిపై కేసు పెట్టినట్లు ఆయ‌న స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వెంకన్నపై భక్తితో కాదు.. జగనన్నపై భక్తితో కేసు వేశాన‌న్నారు. 2019లో తితిదే పంచాంగం కోసం వెబ్ సైట్‌లో వెతికితే అన్యమత పదం క‌న‌ప‌డ‌టంతో  సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. అయితే తప్పును వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతిపైనే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేసు పెట్టి రూ.వంద కోట్లకు పరువునష్టం దావా వేసింది. తితిదేకు మద్దతుగా  రంగంలోకి దిగిన సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చి తాను కూడా ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తున్నట్లు మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ ప్రకటించారు. సుబ్రహ్మణ్యస్వామి తిరుమలకు వచ్చి వెంకన్నను మాత్రం దర్శించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. తితిదే పెట్టిన కేసులో పోలీసులు వేగంగా విచారణ జరపడంలేదంటూ సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: